Puthalapattu: బంగారుపాళ్యంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు!

Puthalapattu: డీఎస్సీ నియామకాల అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

VASU, PUTTALAPATTU
Published on: 6 Aug 2026 8:04 PM IST
Puthalapattu
X

Puthalapattu: బంగారుపాళ్యంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు!

పూతలపట్టు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు బంగారుపాళ్యం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షను పూతలపట్టు వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన చేపట్టారు.

ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ప్రధానంగా డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను రద్దుచేసి పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్నారు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.

మాజీ శాసన సభ్యురాలు లలిత కుమారి మాట్లాడుతూ నిరుద్యోగ భృతిని పునరుద్ధరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, శిరీష రెడ్డి, కుమార్ రాజా, కిషోర్ కుమార్ రెడ్డి, యాదమరి మండల కన్వీనర్ ధనుంజయ రెడ్డి, నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story