Annamayya: అర్ధరాత్రి మృత్యువు కాటు.. పాముకాటుతో వృద్ధురాలు మృతి!
Annamayya: అన్నమయ్య జిల్లా కురబలకోటలో విషాదం. కోనంగివారిపల్లిలో నిద్రిస్తున్న వృద్ధురాలు యర్రమ్మను పాము కాటేయడంతో మృతి.
Annamayya: అర్ధరాత్రి మృత్యువు కాటు.. పాముకాటుతో వృద్ధురాలు మృతి!
అన్నమయ్య జిల్లా: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం కోనంగివారిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యర్రమ్మ (85) పాముకాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, యర్రమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసిందని చెప్పారు. వెంటనే ఆమెను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, విషాదంలో మునిగిపోయారు.
Next Story




