Chittoor: మతం మారిన ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి!

Chittoor: క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రాలు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం.

Chandra Sekhar, Chittoor
Published on: 22 July 2026 1:26 PM IST
Chittoor
X

Chittoor: మతం మారిన ఎస్సీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి!

Chittoor: క్రైస్తవ,ముస్లిం మతంలోకి మారిన ఎస్సీ వర్గానికి చెందిన వారు కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకపోవడం,రాజ్యాంగబద్ధమైన హక్కులు కోల్పోతున్నారని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ తెలిపారు.

చిత్తూరులోని లూక్ చర్చి నందు జరిగిన మైనార్టీ ఐక్యవేదిక సమావేశంలో ఆయన పాల్గొన్నాను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మతం ఆధారంగా హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమనిపేర్కొన్నారు.రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు అన్ని మతాల వారికి సమానంగా అమలు చేయాలని,ఎస్సీ హక్కులను మత మార్పిడి కారణంగా తొలగించరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక,కేరళ,పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఇది అంశంపై అవగాహన సదస్సులునిర్వహిస్తున్నామన్నారు.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి,సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న సంబంధిత అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో పాస్టర్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ ఆర్ .జోబ్ డాల్విన్,మత పెద్దలు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story