Madanapalle: నిఖా వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించిన ఎస్.రెడ్డీ సాహెబ్!
Madanapalle: నిమ్మనపల్లెలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ నేత ముబారక్ ఖాన్ కుమారుడి నిఖా వేడుక. హాజరై వధూవరులను ఆశీర్వదించిన సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్.
Madanapalle: నిఖా వేడుకల్లో వధూవరులను ఆశీర్వదించిన ఎస్.రెడ్డీ సాహెబ్!
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లి సైదాపేటలో కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పి.ముబారక్ ఖాన్ కుమారుడు పి.మోయిన్ ఖాన్ నిఖా కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ నిఖా వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముబారక్ ఖాన్ కుటుంబ సభ్యులు ఎస్.రెడ్డీ సాహెబ్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వేదికపై నూతన వధూవరులను ఎస్.రెడ్డీ సాహెబ్ ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




