Renigunta: రేణిగుంటలో రైల్వే సంత గేటు మూసివేత ప్రయాణికులకు అలర్ట్!

Renigunta: రేణిగుంట రైల్వే సంత గేటు తాత్కాలికంగా మూసివేత. మరమ్మతుల దృష్ట్యా 24 నుండి 27 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని సూచన.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 Aug 2026 11:47 AM IST
Renigunta
X

Renigunta: రేణిగుంటలో రైల్వే సంత గేటు మూసివేత ప్రయాణికులకు అలర్ట్!

Renigunta: రేణిగుంట పట్టణంలోని రైల్వే సంత గేటు వద్ద అత్యవసర మరమ్మతులు,భద్రతా పనులు చేపట్టేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గేటును పూర్తిగా మూసివేయనున్నారు.

వరుసగా నాలుగు రోజుల పాటు గేటు మూసివేయనున్న నేపథ్యంలో స్థానిక ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు,రైల్వే పోలీసులు సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story