Renigunta: వైన్స్ షాప్ పక్కనే ‘మందు’ జాతర అధికారుల నిఘా ఎక్కడ?
Renigunta: రేణిగుంట గాజులమండ్యం రైల్వే సంత గేటు వద్ద బహిరంగంగా మద్యం సేవించడంపై ప్రజల నిరసన. బెల్ట్ షాపులు, ముందస్తు విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిఘా కొరవడిందని స్థానికులు ఆగ్రహం.
Renigunta: వైన్స్ షాప్ పక్కనే ‘మందు’ జాతర అధికారుల నిఘా ఎక్కడ?
Renigunta: రేణిగుంట మండలం గాజులమండ్యం పరిధిలోని రైల్వే సంత గేటు సమీపంలో వైన్స్ షాప్ చుట్టూ మందుబాబుల హల్‌చల్ కనిపిస్తోంది.
ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గం పక్కనే కొంతమంది వ్యక్తులు ఉదయాన్నే బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంత ఉదయాన్నే వారి చేతికి మద్యం ఎలా చేరిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
ముందురోజే మద్యం కొనుగోలు చేసి ఉదయం సేవిస్తున్నారా? లేక నిర్ణీత సమయానికి ముందే వైన్స్ షాప్ నిర్వాహకుల నుంచి రహస్యంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? అసలు వైన్స్ పరిసరాల్లో ఇంత బహిరంగంగా మద్యం సేవిస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
రైల్వే సంత గేటు.. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట వైన్స్ సమీపంలోనే బహిరంగంగా మద్యం సేవించడం స్థానికులకు ఇబ్బందికరంగా మారుతోందని వారు చెబుతున్నారు. మద్యం సేవిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడ? వైన్స్ షాప్ పరిసరాల్లో నిఘా ఎందుకు కొరవడింది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక నిర్ణీత సమయానికి ముందే మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న అనుమానాలపై కూడా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
వైన్స్ షాప్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు,నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా లేదా అన్నది తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.




