Madanapalle: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన రేగాడి ప్రసాద్ కుమార్

Madanapalle: మంత్రి కొల్లు రవీంద్రను రాష్ట్ర బలిజ, కాపు, తెలగ, ఒంటరి అఖిలభారత రాయలసీమ అధ్యక్షుడు రేగాడి ప్రసాద్ కుమార్ కలిశారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 Jun 2026 1:53 PM IST
Madanapalle
X

Madanapalle: మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన రేగాడి ప్రసాద్ కుమార్

అన్నమయ్య జిల్లా: మదనపల్లె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను గురువారం సాయంత్రం రాష్ట్ర బలిజ, కాపు, తెలగ, ఒంటరి అఖిలభారత రాయలసీమ అధ్యక్షులు రేగాడి ప్రసాద్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని 22వ వార్డు సమస్యలతో పాటు మదనపల్లె బలిజ సామాజిక వర్గానికి కాపు భవన్ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story