Ramasamudram: ఎగువ దిన్నిమీద ఘనంగా గంగమ్మ ఆలయాల విగ్రహ ప్రతిష్ట!

Ramasamudram: రామసముద్రం ఎగువ దిన్నిమీద హరిజనవాడలో నల్లగంగమ్మ, కుంటి గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట. కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసిన టేకుపల్లి శ్రీనివాసులు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Sept 2026 8:31 AM IST
Ramasamudram
X

Ramasamudram: ఎగువ దిన్నిమీద ఘనంగా గంగమ్మ ఆలయాల విగ్రహ ప్రతిష్ట!

Ramasamudram: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ ఎగువ దిన్నిమీద హరిజనవాడలో నూతనంగా నిర్మించిన నల్లగంగమ్మ, కుంటి గంగమ్మ ఆలయాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ BRK న్యూస్ రిపోర్టర్ టేకుపల్లి శ్రీనివాసులు హాజరయ్యారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆలయాలను సందర్శించిన శ్రీనివాసులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు హేమవతి, టేకుపల్లి శ్రీనివాసులు దంపతులను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టేకుపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, నల్లగంగమ్మ, కుంటి గంగమ్మ అమ్మవార్ల ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలు ఐకమత్యంతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గ్రామస్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగప్ప, శంకర, సుధా, నారాయణ, రవి, ఆలయ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle