Ramasamudram: రామసముద్రంలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్!

Ramasamudram: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరిక.

Srinivasulu, Madanapalle
Published on: 1 Sept 2026 5:03 PM IST
Ramasamudram
X

Ramasamudram: రామసముద్రంలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్!

Ramasamudram: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామసముద్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై హృషికేశవర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్‌లో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతిభద్రతలకు సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్సై హృషికేశవర్ రెడ్డి మాట్లాడుతూ.. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గొడవలు, బెదిరింపులు, ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్సై హృషికేశవర్ రెడ్డి కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story