Ramasamudram: రామసముద్రంలో ఘనంగా ఎంపీ మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Ramasamudram: రామసముద్రంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు.
Ramasamudram: రామసముద్రంలో ఘనంగా ఎంపీ మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
రామసముద్రం: రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో మండల కన్వీనర్ కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిధున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు కనగాని గెవన్న, ఎంపీటీసీలు విశ్వనాథ్‌రెడ్డి, మస్తాన్, గంగప్ప, రాధారెడ్డి, జయరామిరెడ్డి, భాస్కర్‌గౌడ్, రమణారెడ్డి, బుడ్డారెడ్డి, మాజీ సర్పంచ్ ఉదయ్ శంకర్‌రెడ్డి, తిప్పా రాజు, శ్రీనివాసులురెడ్డి, వాల్మీకి సంఘం అధ్యక్షులు దొడ్డిపల్లి ఆనంద, డాక్టర్ ప్రకాష్, ఎర్రపల్లి తిమ్మారెడ్డి, సోము, మైనార్టీ అధ్యక్షులు సర్దార్ భాషా, బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్, శుభాష్ చంద్ర, విజయ్‌కుమార్‌రెడ్డి, నరసాపురం చంగప్ప, రమేష్, శీనా, సీహెచ్ మంజునాథ్‌రెడ్డి, రెడ్డి శేఖర్‌నాయుడు, రహంతుల్లా, ఇమ్రాన్, వాటర్‌సామి, ఆరిఫ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిధున్‌రెడ్డి ప్రజలకు మరింత సేవలందిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




