Ramasamudram: దీన్నేపల్లిలో శ్రీదేవి తిమ్మరాయుని స్వామి సన్నిధిలో ఘనంగా అన్నదానం

Ramasamudram: రామసముద్రం మండలం దీన్నేపల్లి శ్రీదేవి తిమ్మరాయుని స్వామి మొరుకొండలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులకు ఘనంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 29 Aug 2026 9:33 PM IST
Ramasamudram
X

Ramasamudram: దీన్నేపల్లిలో శ్రీదేవి తిమ్మరాయుని స్వామి సన్నిధిలో ఘనంగా అన్నదానం

రామసముద్రం: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం దీన్నేపల్లిలో వెలసిన శ్రీదేవి తిమ్మరాయుని స్వామి మొరుకొండలో శ్రావణ మాసం సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షులు కనగాని గెవన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

గత మూడు శనివారాలుగా మొరుకొండలో భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కనగాని గెవన్న మాట్లాడుతూ శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని అన్నారు.

అన్నదానం ద్వారా భక్తులకు సేవ చేయడంతో పాటు ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story