Puttur: రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం
Puttur: పుత్తూరు ఆర్‌పీఎఫ్ తనిఖీల్లో రూ.1.5 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం. ఇద్దరు నిందితుల అరెస్ట్, ఆహార భద్రత శాఖ జరిమానా.
Puttur: రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం
పుత్తూరు: తిరుపతి జిల్లా పుత్తూరు రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో రూ.1.5 లక్షల విలువైన 499 ప్యాకెట్ల (63.5 కిలోలు) నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సెబాస్టియన్ పర్యవేక్షణలో జూలై 29న గంజాయి, నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరి–తిరుత్తణి మధ్య ప్రయాణిస్తున్న రైలు నెం.16058లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద భారీ మొత్తంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు గుర్తించారు. నిందితులను ఒడిశాకు చెందిన చిత్తరంజన్ మహాపాత్ర (42), తమిళనాడుకు చెందిన శరవణన్ (53)గా గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న పొగాకు ఉత్పత్తులపై ఆహార భద్రత శాఖ రూ.25 వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.




