Puthalapattu: వేము ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్

Puthalapattu: వేము ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జేఎన్టీయూ అనంతపురం రిజిస్టర్ దుర్గాప్రసాద్, చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు పాల్గొని దిశానిర్దేశం చేశారు.

VASU, PUTTALAPATTU
Published on: 8 Sept 2026 11:35 PM IST
Puthalapattu
X

Puthalapattu: వేము ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఓరియంటేషన్

పూతలపట్టు: వేము ఇనిస్టిట్యూట్లో ఘనంగా ఓరియంటేషన్.......... పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపానగల వేము ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ రోజైన మంగళవారంఓరియంటేషన్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం రిజిస్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగం కంటే ఉద్యోగయోగ్యత లేకపోవడమే నేటి ప్రధాన సవాలు అని పేర్కొంటూ కళాశాలలో నేర్చుకుని విద్యుత్ తో పాటు ఇంటి వద్ద కూడా క్రమం తప్పకుండా సాధన చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

ప్రిన్సిపాల్ నవీన్ కిలారి మాట్లాడుతూ నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ప్రస్తుతం ఉద్యోగం మార్కెట్లో కేవలం డిగ్రీ ఉండడం మాత్రమే సరిపోదని విద్యార్థులు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు వైస్ ప్రిన్సిపల్ సాయి శిరీష మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో మంచి ప్రవర్తన వ్యక్తిత్వం క్రమశిక్షణ అత్యంత కీలకమని అన్నారు మంచి ప్రవర్తనతోనే జీవితంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోగలరని తెలిపారు.

కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం కమ్యూనికేషన్ స్కిల్స్ సాంకేతిక నైపుణ్యాలు విషయ పరిజ్ఞానం పై అవగాహన ఉండాలన్నారు విలువలతో కూడిన విద్యను అందించేందుకు కళాశాల తరఫున తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story