Puthalapattu: పూతలపట్టు రైతుల కోసం అత్యాధునిక యు.బి.ఆర్ ఫ్యాక్టరీ
Puthalapattu: పూతలపట్టులో అత్యాధునిక యు.బి.ఆర్ ఫ్రూట్స్ ఫ్యాక్టరీ ప్రారంభం. జిల్లా రైతుల పండ్లకు గిట్టుబాటు ధర, విదేశాలకు ఎగుమతులు లక్ష్యమని తెలిపిన యాజమాన్యం.
Puthalapattu: పూతలపట్టు రైతుల కోసం అత్యాధునిక యు.బి.ఆర్ ఫ్యాక్టరీ
పూతలపట్టు: వివిధ రకాల పండ్ల ఉత్పత్తి ఫ్యాక్టరీ. రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోని రైతు ప్రయోజనాల కోసం సకాలంలో నిర్మించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్యాక్టరీ యాజమాన్యం. రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పూతలపట్టు మండలం తల పల పల్లి పంచాయతీ నందు అత్యాధునిక విజ్ఞానంతో యు.బి.ఆర్ ఫ్రూట్స్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగిందని యాజమాన్యం తెలిపారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్ చొరవతోనే సకాలంలో ఫ్యాక్టరీ నిర్మించి జిల్లాలోని రైతులకు అందుబాటులోకి తెచ్చి గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నందు రైతులు పండించే కూరగాయలు మొదలుకొని, మామిడికాయలు, పరిందకాయలు, జామ, సపోటా మొదలగు పండ్లను రకరకాల ఉత్పత్తుల ద్వారా ఎక్కువ శాతం చల్లబరిచి విదేశాలకు ఎగుమతి చేస్తామని యాజమాన్యం తెలిపారు.
యు బి ఆర్ తయారుచేసే రకరకాల ఉత్పత్తులు ఎక్కువ చల్లబరచడం వలన ఒక సంవత్సర కాలము నిల్వ ఉంచుకోవచ్చని అన్నారు. సంవత్సరం పూర్తిగా ఫ్యాక్టరీని నడిపిస్తూ రైతులు పండించే వివిధ రకాల పంటలకు ప్రాధాన్యతనిస్తూ, రైతులను ఎప్పటికప్పుడు ఆదుకుంటామని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు పాల్గొన్నారు.




