Chittoor: పేదలకు ఊరట: పూతలపట్టులో తక్కువ ధరకే సన్న బియ్యం పంపిణీ!

Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టులో తక్కువ ధరకే మేలైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు.

VASU, PUTTALAPATTU
Published on: 3 Aug 2026 5:34 PM IST
Chittoor
X

Chittoor: పేదలకు ఊరట: పూతలపట్టులో తక్కువ ధరకే సన్న బియ్యం పంపిణీ!

చిత్తూర్: పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఆసరా కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంది. నిత్యవసర వస్తువులు, మరి ముఖ్యంగా బియ్యం ధరలు పెరిగిపోయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం బియ్యం ధరలపై స్టీమ్ బియ్యం 1kg 62 రూపాయలు ఉన్న ధరను 52 రూపాయలకు రా బియ్యం 1kg 58 రూపాయలు ఉన్న ధరను 50 చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు భారం తగ్గించాలి అని కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో లో ఉన్న సంఘం సూపర్ బజార్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిత్యవసర వస్తువులు, బియ్యం ధరలను పేద ప్రజలకు భారం కాకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వి వినియోగించుకోవాలని తెలిపారు. డీఎస్ఓ ఆఫీస్ నుంచి రవీంద్రబాబు, హిమ్మత్, పూతలపట్టు సీఐ తిమ్మయ్య, పూతలపట్టు తాసిల్దార్ ఉదయ్ కిషోర్, ఎంపీడీవో నాగరాజు, ఈ డి టి మహేశ్వరి, డిటి మునికృష్ణ, పూతలపట్టు మండల టిడిపి కన్వీనర్ దొరబాబు చౌదరి, తెలుగుదేశం నాయకులు మురళి, చంద్రమౌళి, సింగల్ గుండు అధ్యక్షుడు జగన్నాథం, రేషన్ డీలర్స్ సంఘం ప్రెసిడెంట్ సురేంద్ర నాయుడు. ఎమ్మార్వో కార్యాల సిబ్బంది, రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story