Punganur: చల్లా బాబును కలిసిన టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు!
Punganur: పుంగనూరు టీడీపీ మాజీ ఇన్చార్జ్ చల్లా బాబును నూతన ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ బలోపేతంపై చర్చించారు.
Punganur: చల్లా బాబును కలిసిన టీడీపీ ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు!
Punganur: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జ్ చల్లా బాబు కలిసిన నూతన ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా సంభాషించారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై పరస్పరం చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ప్రజా సమస్యలపై నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయడం వంటి పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించుకున్నారు.
ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పార్టీ విజయమే కీలక లక్ష్యంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తను కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తామని, సమన్వయంతో ముందుకు సాగుతామని చల్లా రామచంద్రారెడ్డి హామీ.
అనుభవజ్ఞుల మార్గదర్శనం – యువ నాయకత్వం – కార్యకర్తల అంకితభావం – నాయకుల ఐక్యతతో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలమైన పునాది నిర్మిద్దాం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సమిష్టిగా పనిచేద్దామన్న నూతన ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు.




