Punganur: పుంగనూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు 500 బైక్‌లతో భారీ ర్యాలీ!

Punganur: పుంగనూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. 500 మంది జనసైనికులతో భారీ బైక్ ర్యాలీ, ఎన్టీఆర్ సర్కిల్‌లో కేక్ కట్ చేసిన నాయకులు.

MAHESH, PUNGANOOR
Published on: 3 Sept 2026 12:11 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు 500 బైక్‌లతో భారీ ర్యాలీ!

Punganur: పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story