Chittoor: నాసిరకం మేతతో కోళ్లు మృతి: చిత్తూరులో రైతుల ఆందోళన!
Chittoor: నాసిరకం మేత కారణంగా కోళ్లు మృతి చెందాయని ఆరోపిస్తూ చిత్తూరు సీబీ రోడ్డులోని ఎస్కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద 25 మంది రైతులు మృతి చెందిన కోళ్లతో ఆందోళన చేపట్టారు.
Chittoor: నాసిరకం మేతతో కోళ్లు మృతి: చిత్తూరులో రైతుల ఆందోళన!
చిత్తూర్: నాసిరకం కోళ్ల మేత విక్రయించడంతో తమ కోళ్లు మృత్యువాత పడ్డాయని ఆరోపిస్తూ 25 మంది కోళ్ల రైతులు చిత్తూరు నగరంలోని ఎస్కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.చిత్తూరు సీబీ రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్కేఎం కోళ్ల మేత కేంద్రం వద్ద మంగళవారం రైతులు మృతి చెందిన కోళ్లను తీసుకొచ్చి నిరసన తెలిపారు.
నాసిరకం మేత కారణంగా భారీగా కోళ్లు మృతి చెందడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తమకు జరిగిన నష్టంపై పలుమార్లు మేత కేంద్రం యాజమాన్యానికి విన్నవించినప్పటికీ స్పందించలేదని రైతులు ఆరోపించారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన కోళ్లతో పాటు నిరసన చేపట్టిన రైతులు.. నాసిరకం మేత విక్రయించిన వ్యవహారంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, తమకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలని కోరారు. రైతుల ఆందోళనతో ఎస్కేఎం కోళ్ల మేత కేంద్రం యజమాని పై అనిమల్ హస్బెండ్ డి డి గారి ని కలసి ఫిర్యాదు చేశామని తెలిపారు.




