Madanapalle: అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న క్యాంటీన్‌లో నేమ్ బోర్డు సరిగా వెలగకపోవడం, ప్రాంగణంలోని కొన్ని లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, 22వ వార్డు అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకం ద్వారా కేవలం ₹5కే భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే నిర్వహణలో లోపాల కారణంగా ప్రజల్లో ప్రభుత్వ పథకంపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే పరిస్థితి నెలకొనకూడదన్నారు. కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారులు బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టకుండా వెంటనే స్పందించి, నేమ్ బోర్డు పూర్తిస్థాయిలో వెలిగేలా చర్యలు తీసుకోవాలని, పనిచేయని అన్ని లైట్లను మరమ్మతు చేయాలని లేదా కొత్తవాటితో మార్చాలని కోరారు.
నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే సంబంధిత కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రతిష్ఠ దెబ్బతినకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి, అన్న క్యాంటీన్‌లో నాణ్యమైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రేగడి ప్రసాద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




