Palamaner: పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు సిద్ధం
Palamaner: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో అంటువ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు. ప్రత్యేక వార్డు సిద్ధం చేశాం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్ మమతారాణి.
Palamaner: పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు సిద్ధం
పలమనేరు: పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వంటి అంటువ్యాధుల నివారణ కోసం అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవసరమైతే రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధంగా ఉంచారు.
ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలు జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉంటే స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు.
అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన డాక్టర్ మమతారాణి
Next Story




