Madanapalle: రోడ్డుపై చెత్త వేస్తే షాపులు సీజ్..
Madanapalle: మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Madanapalle: రోడ్డుపై చెత్త వేస్తే షాపులు సీజ్..
మదనపల్లె: మదనపల్లి పట్టణాన్ని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం అనిబిసెంట్ కూడలి నుంచి బెంగళూరు రోడ్డు బస్ స్టాండ్ వరకు కార్యక్రమాన్ని ప్రారంభించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్త తొలగింపులో పాల్గొన్నారు.
నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణతో పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తే ముందుగా హెచ్చరికలు, మార్పు రాకపోతే జరిమానాలు, అవసరమైతే షాపుల సీజ్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Next Story




