Madanapalle: మదనపల్లెలో పాత్రికేయుడు యుగంధర్‌కు నవజీవన్ సొసైటీ భరోసా
Madanapalle: మదనపల్లెలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానపడిన సీనియర్ పాత్రికేయుడు యుగంధర్‌ను నవజీవన్ సొసైటీ సభ్యులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Madanapalle: మదనపల్లెలో పాత్రికేయుడు యుగంధర్‌కు నవజీవన్ సొసైటీ భరోసా
అన్నమయ్య జిల్లా:-మదనపల్లె
సీనియర్ పాత్రికేయుడికి చేయూత...పరామర్శించిన నవజీవన్ వెల్ఫేర్ సొసైటి సభ్యులు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచం పట్టిన సీనియర్ పాత్రికేయుడు యుగంధర్ ను నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ అద్యక్షురాలు పద్మావతి, జనరల్ సెక్రటరీ గొంగడి కృష్ణమూర్తి, కోశాధికారి కృష్ణపూజిత లు ఆదివారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. సొసైటీ తరఫున ఆర్థిక చేయూత అందించారు. యుగంధర్ కు ఆయన భార్య సరస్వతికి ధైర్యం చెప్పి భరోసా అందించారు. పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా మందులు వాడాలని, ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సొసైటీ తరఫున మరింత సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని తెలియజేస్తూ కొన్ని రకాల పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు యుగంధర్ తీవ్రంగా గాయపడి కాలు పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఈ కేసును త్వరగా పరిష్కరించి, బాధితునికి తగు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి తగు ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వీలైతే భాదితునికి గాని అతని భార్యకు గానీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. త్వరగా కోలుకొని తిరిగి పాత్రికేయ వృత్తిలో కొనసాగాలని ఆకాంక్షించారు.




