Vijayapuram: నగరి నియోజకవర్గంలో నూతన తారు రోడ్డు ప్రారంభం

Vijayapuram: నగరి నియోజకవర్గం విజయపురం మండలంలోని కోసలనగరం నుంచి మిట్టూరు వరకు కూటమి ప్రభుత్వం నిర్మించిన నూతన తారు రోడ్డును ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 May 2026 6:39 PM IST
Vijayapuram
X

Vijayapuram: నగరి నియోజకవర్గంలో నూతన తారు రోడ్డు ప్రారంభం

Vijayapuram: నగరి నియోజకవర్గ పరిధిలోని విజయపురం మండలం కోసలనగరం నుంచి మిట్టూరు వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన తారు రోడ్డును ఎమ్మెల్యే భాను ప్రకాష్ ప్రారంభించారు.సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు ఎంతోకాలంగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది.గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story