Chittoor: పూతలపట్టు: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్!
Chittoor: పూతలపట్టు: బంగారుపాళ్యం ఎస్సీ కాలనీకి స్మశాన వాటిక స్థలం మంజూరు చేయించి 70 ఏళ్ల కల సాకారం చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్.
Chittoor: పూతలపట్టు: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్!
Chittoor: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే పరమావధిగా దూసుకుపోతున్న పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ నేడు మరో చారిత్రాత్మక అడుగు వేశారు.
బంగారుపాళ్యం మండలంలోని బంగారుపాళ్యం ఎస్సీ కాలనీ నివాసితులకు గత 70 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక పడుతున్న అవస్థలను స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, నాడు ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని కాలనీ ప్రజలకు మాట ఇచ్చారు.
ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో కలిసి బంగారుపాళ్యం ఎస్సీ కాలనీలో స్వయంగా పర్యటించిన ఎమ్మెల్యే గారు, అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి స్మశాన వాటిక కొరకు స్థలాన్ని మంజూరు చేయించారు. 7 దశాబ్దాల సుదీర్ఘ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.




