Chittoor: ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం!

Chittoor: చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్, సభ్యులతో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 24 July 2026 4:40 PM IST
Chittoor
X

Chittoor: ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం!

చిత్తూరు: ఘనంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నూతన కమిటీ చైర్మన్ హరిబాబు సహా మొత్తం తొమ్మిది మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి కృషి చేసి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనిఆకాంక్షించారు. కార్యక్రమం ముగింపులో నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, కూటమి నాయకులు సురేంద్ర కుమార్, అట్లూరి శ్రీనివాసులు, అముద, రాజేష్ కుమార్ రెడ్డి, వరదరాజులు, ఈశ్వరరావు, కాజూరు బాలాజీ, నరేష్, పచ్చయప్ప, వరలక్ష్

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story