Nagari: నగరి దేశమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

Nagari: నగరి గ్రామదేవత దేశమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 9 Aug 2026 12:39 PM IST
Nagari
X

Nagari: నగరి దేశమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

నగరి నియోజకవర్గం

నేత్ర ప్రధాయిని దేశమ్మ తల్లీ అమ్మవారికీ పట్టు వస్త్రాలు సమర్పించిన....

నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్

ఆడినెల (ఆషాడ మాసం)సందర్బంగా ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరుపున నగరి గ్రామదేవత నేత్రపధాయిని దేశమ్మ అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు మర్యాదపూర్వకంగా దుశాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి,పూర్ణకుంభంతో మేల తాళాలు నడుమ ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు.ఆలయ ఈవో మునికృష్ణమూర్తి దేశమ్మ తల్లీ అమ్మవారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు బహుకరించారు.

అదేవిదంగా అమ్మవారి సన్నిధిలో భక్తులకు ఏర్పాటుచేసిన మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశమ్మ దేవస్థాన పాలకమండలి చైర్మన్ & సభ్యుల ఆధ్వర్యంలో నారాయణద్రి వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఉచిత కంటివైద్య శిబిరాన్ని సందర్శించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story