Karvetinagaram: జడ్పీహెచ్‌ఎస్ బాలికల స్కూల్‌లో వస్త్రాల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

Karvetinagaram: కార్వేటినగరం జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో మెగా పిటిఎం 4.0 ఘనంగా జరిగింది.

VIJAY, G.D.NELLORE
Published on: 24 July 2026 4:12 PM IST
Karvetinagaram
X

Karvetinagaram: జడ్పీహెచ్‌ఎస్ బాలికల స్కూల్‌లో వస్త్రాల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

Karvetinagaram: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం లోని జడ్పీ హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం మెగా పి టి ఏం 4.0 ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ పి ఎం థామస్ విచ్చేసి ప్రసంగించారు.

మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మాట్లాడుతూ

ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సమగ్రాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య భాగస్వామ్యానికి మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

అనంతరం దాతల సహాయంతో విద్యార్థినీలకు బట్టలు పంపిణీ చేశారు, ఆడికృత్తిక పోస్టర్లను ఆవిష్కరించారు, ధర్మరాజుల ఆలయంలో అర్జున తపస్మాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్, ప్రధానోపాధ్యాయులు శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజన్న, సింగల్ విండో అధ్యక్షులు జనార్దన్ రాజు, రాష్ట్ర కాలుష్య రాష్ట్ర పొల్యూషన్ బోర్డు నెంబర్ నాగేశ్వరరాజు, సీనియర్ నాయకులు రాజేంద్రరెడ్డి, రవి యాదవ్, రామిశెట్టి రాజశేఖర్, బీగాల రమేష్, పాదిరి కుప్పం గంగయ్య,మండల అధికారులు ఎంపీడీఓ రాధిక సింగిరెడ్డి, ఎంఈఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE

Next Story