Kunavaram: నర్సింగపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మిస్సింగ్ కథ సుఖాంతం!

Kunavaram: కూనవరం మండలం నర్సింగపేట ఆశ్రమ పాఠశాలలో మిస్సింగ్ అయిన ఇద్దరు విద్యార్థినులు క్షేమంగా ఇంటికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Sept 2026 3:52 PM IST
Kunavaram
X

Kunavaram: నర్సింగపేట ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మిస్సింగ్ కథ సుఖాంతం!

Kunavaram: కూనవరం మండలం నర్సింగపేట ఆశ్రమ పాఠశాలలో కొండ్ల మధులత 9వ తరగతి, రూతు ఏడవ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ సోమవారం పాఠశాలలో ఎవరికి తెలియకుండా బయటికి వెళ్లిపోయారు.మంగళవారం ఉదయం విద్యార్థుల మిస్సింగ్ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు కబురు అందించారు.

విద్యార్థుల మిస్సింగ్ తో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.కాగా విద్యార్థులు రాత్రిపూట బంధువుల ఇంట్లో నిద్రించి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేరు.విద్యార్థులు ఇంటికి చేరడంతో మిస్సింగ్ ఉత్కంఠకు తెరపడింది.దింతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story