Rayachoti: ప్రజా చేరువ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Rayachoti: రాయచోటిలో రేపు జరగనున్న 'ప్రజా చేరువ' కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
Rayachoti: ప్రజా చేరువ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో రేపు నిర్వహించనున్న ‘ప్రజా చేరువ’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొననున్న నేపథ్యంలో రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో కార్యక్రమాల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు.
మంత్రి గారితో పాటు ఆయన సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణ, అతిథుల రాక, ప్రజలు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
రేపటి ‘ప్రజా చేరువ’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.




