Chittoor: నూతన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Chittoor: చిత్తూరులో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్‌తో కలిసి పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 5:11 PM IST
Chittoor
X

Chittoor: నూతన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Chittoor: చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చిత్తూరుకు చేరుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారితో కలిసి నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా నూతన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రివర్యులకు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించి పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షణ్ముఖ రెడ్డి, పార్లమెంట్ కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్మన్ కటారి హేమలత, కాజూరి బాలాజీ, మాజీ మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన పార్టీ కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story