Gurramkonda: గుర్రంకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా యోగా దినోత్సవం

Gurramkonda: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

RAVI, PILERU
Published on: 21 Jun 2026 11:34 AM IST
Gurramkonda
X

Gurramkonda: గుర్రంకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా యోగా దినోత్సవం

గుర్రంకొండ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుర్రం కొండ జడ్పిహెచ్ ఉన్నత పాఠశాలలో యోగబ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ ఉజ్వల భవిష్యత్తును ఆరోగ్యకరమైన జీవనం కోసం యోగాను తమ దైనదినా జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొంటున్న అనేక శారీరక మానసిక సమస్యలకు యోగ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందన్నారు. యోగా గురువు చేత సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి యోగ ఆసనాలను చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, ఎంపీడీవో సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RAVI, PILERU

RAVI, PILERU

Next Story