Madanapalle: మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
Madanapalle: సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Madanapalle: మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తలకు తీవ్ర గాయం
మదనపల్లె, ఆగస్టు 3:
అన్నమయ్య జిల్లా నల్లగుట్లపల్లికి చెందిన రఘునాథ్ (40) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పులివెందుల నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న రఘునాథ్‌ను బురకాయలకోట గురుకుల పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




