Madanapalle: మదనపల్లెలో చెరువులను మింగేస్తున్న మట్టి మాఫియా.. అధికారులకే సవాల్!
Madanapalle: మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీపంలో గల చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోతోంది.
Madanapalle: మదనపల్లెలో చెరువులను మింగేస్తున్న మట్టి మాఫియా.. అధికారులకే సవాల్!
Madanapalle: మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీపంలో ఉన్న చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ లేని టిప్పర్లు, జేసీబీల సహాయంతో చెరువు నుంచి భారీ స్థాయిలో మట్టిని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై సంబంధిత వ్యక్తులను ప్రశ్నించగా, "రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు గానీ మమ్మల్ని ఏమీ చేయలేరు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ బాధ్యత ఉన్న అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెరువులో జరుగుతున్న తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అలాగే వర్షాకాలంలో నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై రెవెన్యూ, మైనింగ్ మరియు పోలీసు శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




