Madanapalle: టీడీపీ సీనియర్ నాయకుడు శేషచలపతి నాయుడు బర్త్‌డే వేడుకలు!
Madanapalle: మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు శేషచలపతి నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
Madanapalle: టీడీపీ సీనియర్ నాయకుడు శేషచలపతి నాయుడు బర్త్‌డే వేడుకలు!
Madanapalle: టీడీపీ సీనియర్ నాయకులు శేషచలపతి నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం టీడీపీ 32వ వార్డు ఇంచార్జ్, సీనియర్ నాయకులు రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేషచలపతి నాయుడు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ శేషచలపతి నాయుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నాయకులు శేషచలపతి నాయుడికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్ కేర్ మెడికల్స్ రాజశేఖర్, టీడీపీ నాయకుడు కట్ట లక్ష్మీనారాయణ, మంగళ ప్రభాకర్, కాశీ శ్రీరామ్ వాల్మీకి, తమ్మిశెట్టి రామకృష్ణ, సి.బి.ఎన్. రెడ్డిశేఖర్ నాయుడు, తనకంటి మంజునాథ్, కలిశం ప్రకాష్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని శేషచలపతి నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




