Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం

Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై వక్రీకరణలు మానుకోవాలని వైసీపీకి టీడీపీ హెచ్చరిక. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి ట్యాంక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణ.

Srinivasulu, Madanapalle
Published on: 19 July 2026 7:35 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె తాగునీటి సమస్యపై టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం

మదనపల్లె: తాగునీటి సమస్యపై వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని టీడీపీ 34వ వార్డు ఇన్‌చార్జ్ బాలమాలి శేఖర్ వైసీపీ నాయకులకు హెచ్చరించారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరత ఏర్పడినా, ఎమ్మెల్యే షాజహాన్ భాష సారథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త బోర్లు తవ్వించడం, పాత బోర్లను పునరుద్ధరించడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తికాక నేటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story