Madanapalle: నిర్మాతగా మారిన మదనపల్లె స్కూల్ ప్రిన్సిపల్ టీజర్ రిలీజ్!

Madanapalle: మదనపల్లె విజయభారతి స్కూల్ ప్రిన్సిపల్ నిశ్చితాసేతు నిర్మాతగా 'హనుమత్ సుందరకాండ' యానిమేషన్ చిత్రం. ఆరు భాషల్లో టీజర్ విడుదల, పూర్తి వివరాలు ఇక్కడ.

Srinivasulu, Madanapalle
Published on: 4 July 2026 7:12 PM IST
Madanapalle
X

Madanapalle: నిర్మాతగా మారిన మదనపల్లె స్కూల్ ప్రిన్సిపల్ టీజర్ రిలీజ్!

మదనపల్లె: విద్యారంగంలోనే కాకుండా క్రీడలు, ఆత్మ రక్షణ విద్యలతో మదనపల్లె పట్టణంలోనే తమ పాఠశాలను అగ్రగామిగా నిలుపుతున్న విజయభారతి విద్యాసంస్థల నూతన ప్రిన్సిపల్ నిశ్చితాసేతు చలన చిత్ర రంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టారు.

తోటి మిత్ర బృందంతో కలసి హనుమత్ సుందకాండ అనే యానిమేషన్ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. ఈమేరకు విజయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీజర్ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయ భారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు ప్రముఖ డాక్టర్లు అనిల్ కుమార్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర రెడ్డి, బండి ఆనంద్, చంద్రశేఖర్ రెడ్డి మహేష్ నారాయణ, కిషోర్ చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. రోమాలను నిక్కబడుచుకునేలా హనుమాన్ సన్నివేశాలను చిత్రీకరించిన డైరెక్టర్ ను అదేవిధంగా ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించతలపెట్టి నిర్మాతగా మారిన నిశ్చితా సేతు బృందాన్ని అభినందించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరు బాషల్లో వినాయక చవితికి విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు. చిత్రం ఘనవిజయం సాధించాలని అతిధులు ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story