Madanapalle: మదనపల్లె పోలీస్ ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు!
Madanapalle: మదనపల్లె జిల్లా పోలీసు ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఎస్పీ ఎం. వెంకటాద్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Madanapalle: మదనపల్లె పోలీస్ ఆఫీసులో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు!
పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి.
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాలతో మదనపల్లె లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో 'చేనేత రంగ పితామహుడు' ప్రగడ కోటయ్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడి, 'ఆప్కో'కు పునాది వేసిన కోటయ్య సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ డి.ఏడుకొండల రెడ్డి, ఆర్ఐ (అడ్మిన్) యు.రంగనాథ బాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, రవి, అమరనాథ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




