Madanapalle: మదనపల్లె మండలంలో ముమ్మరంగా సాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం సాగింది.
Madanapalle: మదనపల్లె మండలంలో ముమ్మరంగా సాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని పొన్నేటిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా బీదం గురునాథ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు ఎలాంటి పొరపాట్లు లేకుండా సవరణలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలిస్తూ, ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




