Madanapalle: మదానపల్లెలో 'లేడీ డాన్' ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు!
Madanapalle: మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన ఇంట్లో పోలీసుల దాడులు. 50 ఆస్తి పత్రాలు, ఫోర్జరీ బాండ్ పేపర్లు స్వాధీనం, రౌడీషీటర్ పై కేసు నమోదు.
Madanapalle: మదానపల్లెలో 'లేడీ డాన్' ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు సోదాలు. మదనపల్లెకు చెందిన ‘లేడీ డాన్’ కోనేటి సులోచన ఇంట్లో పోలీసుల సోదాలు. కోర్టు సెర్చ్ వారెంట్‌తో మూడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు, సులోచన ఇంటితో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లోనూ సోదాలు.
50 రకాల ఆస్తి పత్రాలు, 15 ఫోర్జరీ సంతకాలతో ఉన్న ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం. అప్పుల పేరుతో అమాయకుల నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని ఆస్తులు కాజేసినట్లు ఆరోపణలు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో కలిసి కోట్ల విలువైన భూముల వ్యవహారంలో సులోచనపై ఆరోపణలు.
బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన స్థలం, భవనం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిన వివరాలు. ఫోర్జరీ పవర్ ఆఫ్ అటార్నీతో 47 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు ఫిర్యాదు. స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్న పోలీసులు. సులోచనపై ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు, రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు వెల్లడి.




