Madanapalle: ఆదివారం కూడా ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే!

Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 July 2026 11:59 AM IST
Madanapalle
X

Madanapalle: ఆదివారం కూడా ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే!

ఆదివారం కూడా ఆగని ప్రజా దర్బార్ప్ర జల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక చొరవ

మదనపల్లె, జూలై 26: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మదనపల్లె ఎమ్మెల్యే ఎం.

షాజహాన్ బాషా ఆదివారం తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది.

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

అనంతరం ప్రజా దర్బార్‌లో ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story