Madanapalle: మదనపల్లె విజయభారతి స్కూల్‌లో గురు పౌర్ణమి వేడుకలు..

Madanapalle: మదనపల్లె విజయభారతి హైస్కూల్‌లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని, పాఠశాల ఎన్నికల విజేతలకు నియామక పత్రాలు అందజేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 29 July 2026 8:44 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె విజయభారతి స్కూల్‌లో గురు పౌర్ణమి వేడుకలు..

మదనపల్లె: మదనపల్లె సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, విద్యార్థులు జీవితంలో తల్లిదండ్రులు, గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు.

సంపద కంటే మానవత్వం, సేవాభావం గొప్పవని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ నిశ్చిత సేతు మాట్లాడుతూ, మనిషి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల నుంచి విద్యా ప్రస్థానం వరకు ప్రతి దశలో గురువుల మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు.

గురు పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించి, గురువుల ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది డాక్టర్ ఎన్. సేతు దంపతులను దుశ్శాలువ కప్పి, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్. సేతు, బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర రెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, షంషీర్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story