Madanapalle: 'ఇంటింటికీ టీడీపీ' సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్‌పై ప్రచారం!

Madanapalle: మదనపల్లె 32వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీసీలకు 34% రిజర్వేషన్‌పై ప్రజల్లో అవగాహన.

Srinivasulu, Madanapalle
Published on: 20 Aug 2026 3:41 PM IST
Madanapalle
X

Madanapalle: 'ఇంటింటికీ టీడీపీ' సంక్షేమ పథకాలు, బీసీ రిజర్వేషన్‌పై ప్రచారం!

Madanapalle: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘ఇంటింటికీ టీడీపీ’ డోర్ టు డోర్ కార్యక్రమం మదనపల్లెలో కొనసాగుతోంది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు మదనపల్లె 32వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ హామీలు, తల్లికి వందనం, ఆర్టీసీ బస్సు ప్రయాణం తదితర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి సూచనలు, అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story