Madanapalle: యువత క్రీడల వైపు అడుగులు వేయాలి.. డీఎస్పీ పావని
Madanapalle: మదనపల్లె ఆరోగ్య మాత స్కూల్‌లో గురు హాకీ క్లబ్ ఉచిత సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు.
Madanapalle: యువత క్రీడల వైపు అడుగులు వేయాలి.. డీఎస్పీ పావని
Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఆరోగ్య మాత స్కూల్‌లో గురు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో గత 30 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంప్‌లో భాగంగా విద్యార్థులకు హాకీకి అవసరమైన పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. గురు హాకీ క్లబ్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో డీఎస్పీ పావని చేతుల మీదుగా విద్యార్థులకు హాకీ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఉచిత శిక్షణా శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతరం డీఎస్పీ పావని మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి మార్గంలో ఎదిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురు హాకీ క్లబ్ అధ్యక్షుడు గురు భాస్కర్, జిల్లా హాకీ ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, ఆరోగ్య మాత పాఠశాల హెచ్‌ఎం మేరీ పునీత, సీనియర్ కోచ్‌లు నౌషాద్, గౌస్, సుల్తాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.




