Madanapalle: ట్రాన్స్‌ఫార్మర్ కూల్చివేత: ఎస్పీకి బాధితుల ఫిర్యాదు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నారేవారిపల్లెలో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 8 Sept 2026 8:22 AM IST
Madanapalle
X

Madanapalle: ట్రాన్స్‌ఫార్మర్ కూల్చివేత: ఎస్పీకి బాధితుల ఫిర్యాదు!

Madanapalle: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఓ వ్యక్తి ఉద్దేశ పూర్వకంగా కూల్చివేసి ధ్వంసం చేశాడని బాధితులు రమణ తదితరులు సోమవారం పీజీఆర్ఎస్ జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. రామసముద్రం మం డలం నారేవారిపల్లె గ్రామ పరిధిలో తమ భూమికి ఆనుకుని ఉన్న డీకేటీ స్థలంలో దిమ్మె ఏర్పాటు చేసి ట్రాన్స్ఫూర్మర్ను అమర్చుకున్నామని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ను కూల్చివేసి, వ్యవసాయ విద్యుత్ లైన్లు పొందకుండా అడ్డంకులు సష్టిస్తున్నాడని ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని బాధిత రైతులు సోమవారం ఎస్పీని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story