Madanapalle: రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన మదనపల్లె డీఎస్పీ చంద్రశేఖర్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డీఎస్పీ చంద్రశేఖర్ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.
Madanapalle: రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన మదనపల్లె డీఎస్పీ చంద్రశేఖర్!
మదనపల్లె: విధి నిర్వహణలో ప్రజా సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే మదనపల్లె డీఎస్పీ చంద్రశేఖర్ శనివారం జిల్లా కేంద్రంలోని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన డీఎస్పీ చంద్రశేఖర్‌ను హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్ధిక్ పూలమొక్క అందించి అభినందించారు.
అనంతరం డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల అవసరమైన వారికి ప్రాణాలు కాపాడటమే కాకుండా, రక్తదాత ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు. ప్రతి ఆరోగ్యవంతుడు ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు
Next Story




