Madanapalle: మదనపల్లె 32వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం
Madanapalle: మదనపల్లె 32వ వార్డులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో డోర్ టు డోర్ కార్యక్రమం. సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న జేసీపీ మధుసూదన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లె 32వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని 32వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశాల మేరకు వార్డ్ ఇన్చార్జ్ మండిపల్లి (జేసీపీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి జీవనోపాధి మెరుగుపడేలా పలు సంక్షేమ పథకాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, నాగభూషణ, సురేష్, సురేంద్ర, గణేష్, నాగరాజ, సుధాకర్, మోహన్, వెంకటేష్, సందీప్, అనిల్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.




