Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు జైలు శిక్ష మరియు రూ.11 వేల జరిమానా విధించింది. పూర్తి వివరాలు.

Srinivasulu, Madanapalle
Published on: 27 Aug 2026 12:03 PM IST
Madanapalle
X

Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా!

Madanapalle: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్ (42)కు మదనపల్లి గౌరవనీయ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.

మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 189/2026, తేదీ 20-08-2026, ఎస్‌టీసీ నంబర్ 2082/2026 కేసులో BNS సెక్షన్ 275, మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 కింద ముద్దాయి దోషిగా నిర్ధారించబడ్డాడు.

దీంతో న్యాయస్థానం గురువారం (27-08-2026) రూ.11,000 జరిమానాతో పాటు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ముద్దాయి బి. రాజశేఖర్ నాయక్, తండ్రి బి. హనుమ నాయక్, తనకల్లు మండలం ముండ్లవారిపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో న్యాయస్థానం శిక్ష విధించినట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story