Punganur: రూ.25 లక్షల స్థలం విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్న రాణెమ్మ!

Punganur: పుంగనూరు తాటిమాకులపాళ్యం ప్రభుత్వ పాఠశాలకు రూ.25 లక్షల విలువైన స్థలంతో పాటు వంటగది నిర్మించి ఇచ్చిన దాత రాణెమ్మ.

MAHESH, PUNGANOOR
Published on: 28 Aug 2026 6:16 PM IST
Punganur
X

Punganur: రూ.25 లక్షల స్థలం విరాళమిచ్చి దాతృత్వం చాటుకున్న రాణెమ్మ!

Punganur: పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు.

కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story