Kuppam: కుప్పంలో పిచ్చి కుక్క బీభత్సం.. 16 మంది ఆసుపత్రి పాలు!

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో పిచ్చి కుక్క తీవ్ర బీభత్సం సృష్టించింది.

KUMAR, KUPPAM
Published on: 24 May 2026 8:28 AM IST
Kuppam
X

Kuppam: కుప్పంలో పిచ్చి కుక్క బీభత్సం.. 16 మంది ఆసుపత్రి పాలు!

Kuppam: కుప్పం పట్టణంలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. మర్రిమాను వీధి, ప్యాలెస్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్డుపై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేసి కరిచింది. ఈ ఘటనలో సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికులు వెంటనే కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క భయంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కను పట్టుకుని ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story