Kanipakam: కాణిపాకం గోశాలలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Kanipakam: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి.

VASU, PUTTALAPATTU
Published on: 4 Sept 2026 8:20 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం గోశాలలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Kanipakam: శ్రీ స్వామి వారి దేవస్థానం నందుకృష్ణాష్టమి సందర్భంగా దేవస్థానం గోశాల లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు ఆలయ అధికారులు నిర్వహించారు. ఆలయ అధికారులు ప్రధాన దేవాలయం నుండి పూజ సామగ్రితో గోశాలకు చేరుకుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గోవులకు ప్రత్యేక పూజలు చేసి దానాలు ఇవ్వడం జరిగింది.

గోశాల దగ్గర భక్తులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం చెందిన రాజేంద్ర యాదవ్, ధనంజయ యాదవ్, వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివప్రసాద్, గోశాల ఏఈఓ ధనుంజయ, సూపర్డెంట్ వాసు, అర్చకులు వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story